పుట్టపర్తి ,
సీఎం చంద్రబాబు సుపరిపాలనతో అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు
సర్వహక్కులతో రైతులకు ఉచితంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నాం
డిజిటలైజేషన్‌తో భూములకు శాశ్వత భద్రత – ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేసిన సీఎం చంద్రబాబు
పుట్టపర్తి నియోజకవర్గంలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ
భవిష్యత్ లో పుట్టపర్తి నియోజవర్గ రూపురేఖలు మారిపోవడం ఖాయం
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో గతంలో ఉన్న అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడుతూ అభివృద్ధి వైపు రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
కొత్తచెరువు మండలం వేములేటిపల్లి, మరకుంటపల్లి గ్రామాల్లో గురువారం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పాస్‌పుస్తకాలను ఉచితంగా అందజేశారు.
రైతుల ఆస్తులకు రక్షణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల భూములకు సంపూర్ణ హక్కులు, భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సర్వహక్కులతో ఉచితంగా పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం భూముల రికార్డుల డిజిటలైజేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, డిజిటల్ విధానంలో భూముల వివరాలను భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రైతుల ఆస్తులకు శాశ్వత భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై రైతుల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయని వారు తెలిపారు. రైతుల భూములపై హక్కులు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆ చట్టాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు.
“పొరపాటున వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రైతుల ఆస్తులన్నీ తాకట్టులో ఉండే పరిస్థితి ఏర్పడేది. కూటమి ప్రభుత్వం రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పిస్తోంది” అని వారు అన్నారు.
పుట్టపర్తి రూపురేఖలు మారడం ఖాయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు రావడం నియోజకవర్గ భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు.
అదేవిధంగా ఆమడగూరులో భారీ స్థాయిలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని, దీనివల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతాయని తెలిపారు.
భవిష్యత్తులో బుల్లెట్ సూపర్‌ఫాస్ట్ ట్రైన్, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, మరెన్నో పరిశ్రమలు పుట్టపర్తి నియోజకవర్గానికి రానున్నాయని, వీటితో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారడం ఖాయమని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పెట్టుబడులు–ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పల్లె సింధూర రెడ్డి, డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, మండల టిడిపి కన్వీనర్ రామకృష్ణ,కొత్త చెరువు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ,మండల తహశీల్దార్ నారాయణ రెడ్డి, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి , రవి ,లక్ష్మీనారాయణ రెడ్డి ,వెంకటేష్ ,ఈశ్వర్ రెడ్డి ,వెంకటరెడ్డి ,శ్రీనివాసులు ,రామాంజనేయులు టీడీపీ కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


