నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి – కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలి
సీఐటీయూ నాయకుల పిలుపు
ధర్మవరం: కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న కార్మికుల మహా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం ఏనుములపల్లి మస్టర్ పాయింట్ వద్ద ఢిల్లీ ముట్టడికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కార్యదర్శి పైపల్లి గంగాధర్, జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనంగా రూ.42 వేలు చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని కోరారు.
అదేవిధంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, SIR ప్రక్రియను రద్దు చేయాలని, కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో నిర్వహించనున్న మహా ముట్టడి కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నాగార్జున, వెంకటేష్, సోడా వెంకటేష్, ముత్యాలు, లక్ష్మయ్య, అనిత, సరోజ, లక్ష్మి, శివప్రసాద్, రాము, గంగాధరి, నరసింహ, వేమాద్రి, కదిరప్ప, చిన్నమారెప్ప, రాయుడు తదితరులు పాల్గొన్నారు.



