వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకే కేటాయించాలిఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ మైనార్టీ సెల్ నాయకుల వినతి

Sri Sathya Sai district,హిందూపురం (ఏపీ అక్షర విజయం)

హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని ముస్లిం మైనార్టీ కౌన్సిలర్‌కు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కోరారు. ఈ మేరకు మైనార్టీ నాయకులు, నూతనంగా ఎన్నికైన మైనార్టీ కౌన్సిలర్లు సంయుక్తంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా నిలుస్తున్నారని తెలిపారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి తమ వంతు కృషి చేశారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మైనార్టీలు సహకరించారని వివరించారు. ప్రస్తుతం హిందూపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏడుగురు ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారిలో ఒకరికి వైస్ చైర్మన్ పదవి కల్పించడం ద్వారా మైనార్టీలకు సముచిత గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని విజ్ఞప్తి చేశారు.కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ, ఈ అంశంపై ఎమ్మెల్యే బాలకృష్ణ సానుకూలంగా స్పందించి మైనార్టీ కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కేలా చొరవ చూపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News