సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టుకు రూ.1కోటి నిధులను మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

అమరావతి /పుట్టపర్తి

సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టుకు రూ.1కోటి నిధులను మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టుకు తక్షణం పెండింగ్ నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుకు ,
కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ ద్వారా విన్నవించిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో

తక్షణం రూ. 1కోటీ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు,మంత్రి నారా లోకేష్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి

పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టుకు రూ.1 కోటి నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది.

నియోజకవర్గంలోని ప్రజలకు సురక్షితమైన, నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు ఎంతో కీలకమని ఎమ్మెల్యే సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ,మంత్రి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లగా,వారు వెంటనే స్పందించి తక్షణం ఈ ప్రాజెక్టుకు రూ.1 కోటి నిధులను మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి కూటమి ప్రభుత్వానికి ,సీఎం,డిప్యూటీ సీఎం,నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎంఎల్ఏ పల్లె సింధూర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు.

సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు, సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే సింధూర రెడ్డికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ,ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News