సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో “హిస్టారికల్ సైఫర్స్ ఇన్ క్రిప్టోగ్రఫీ”పై వర్క్‌షాప్:

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి

సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, పుట్టపర్తిలో RISE, Austria ఆధ్వర్యంలో “హిస్టారికల్ సైఫర్స్ ఇన్ క్రిప్టోగ్రఫీ”అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు.

ఈ వర్క్‌షాప్‌కు ఆస్ట్రియ నుండి Dr. Niklas హాజరై విద్యార్థులకు క్రిప్టోగ్రఫీ పరిణామక్రమం, చారిత్రక సైఫర్లు మరియు సురక్షిత సమాచార మార్పిడి యొక్క ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పించారు.

ప్రాచీన కాలం నుంచి ఆధునిక సాంకేతిక యుగం వరకు రహస్య సమాచారాన్ని భద్రపరచడానికి ఉపయోగించిన వివిధ Cipher Techniques గురించి Dr. Niklas వివరించారు. చారిత్రక సైఫర్ల పనితీరు, వాటి రూపకల్పన వెనుక ఉన్న సూత్రాలు, వాటి బలాలు–పరిమితులు, అలాగే ఆధునిక Cryptography మరియు Secure Communication వ్యవస్థలకు అవి ఎలా పునాదిగా నిలిచాయో వివరించారు.

విద్యార్థులు క్రిప్టోగ్రఫీ యొక్క చారిత్రక నేపథ్యంతో పాటు సమాచార భద్రత, డేటా గోప్యత మరియు సురక్షిత కమ్యూనికేషన్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలతో దాని అనుసంధానాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమం ఇంటరాక్టివ్‌గా సాగడంతో విద్యార్థులు ప్రశ్నలు అడిగి, సైఫర్ పద్ధతులపై చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr. S. హేమ చంద్ర , డీన్ అకాడమిక్స్ ప్రొఫెసర్ . D. నాగరాజు మరియు RIT ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ . S. నూర్మొహమ్మద్ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. RIT ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పరిచయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు.

ఈ వర్క్‌షాప్ విద్యార్థుల్లో క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, సురక్షిత సమాచార వ్యవస్థల అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా నిలిచింది.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News