అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

శ్రీ సత్య సాయి జిల్లా…ఓడి చెరువు

అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి మండల పరిధిలోని మిట్టపల్లిలో చోటుచేసుకుంది. మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు వల్లం నాగభూషణ (49) వ్యవ సాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అప్పులు చేసి పంట సాగు చేశాడు. పంట చేతికి రాక తీవ్రంగా నష్టం రావడంతో మనస్తాపం చెందాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే 108లో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య నీలమ్మ , కుమారుడు కుమార్తె ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఓడి చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News