పుట్టపర్తి ఆర్టీసీ డిపో వద్ద ‘సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్ ప్రారంభం

శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి

ఆర్టీసీ డిపో వద్ద అధునాతన పార్క్, ఫుడ్ కోర్ట్‌ను లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

పట్టణవాసులు, సందర్శకులకు ఇక ఆహ్లాదంతో పాటు నోరూరించే రుచులు అందుబాటులో

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో సమీపంలో నూతనంగా నిర్మించిన ‘సాయి గోకులం పార్క్’ మరియు ‘ఫుడ్ కోర్ట్’ గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వీటిని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పుట్టపర్తి పట్టణ ప్రజలతో పాటు ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ పార్క్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి సమయం గడిపేలా పార్క్‌లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, అలాగే సందర్శకులకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండేలా ఫుడ్ కోర్ట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.పట్టణ సుందరీకరణ లో భాగంగా ఆర్టీసీ డిపో వద్ద ఈ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పట్టణవాసులు, పర్యాటకులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ,మున్సిపల్ ప్రత్యేక అధికారి సువర్ణ,పుట్టపర్తి మున్సిపల్ కమీషనర్ జి. శ్రీనివాసులు,స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పుట్టపర్తి పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News