మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్ల భద్రతను పరిశీలించిన డిఎస్పి

  • రాప్తాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ టీం

• పరిటాల శ్రీరామ్ తో కలిసి ఏర్పాట్ల పరిశీలన

అనంతపురం , ధర్మవరం,

ఐటి విద్యాశాఖ మంత్రి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురం డిఎస్పి చంద్రశేఖర్ రాప్తాడులో లోకేష్ పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి ఆయన లోకేష్ ర్యాలీ నిర్వహించబోయే ప్రాంతాలు, విగ్రహావిష్కరణ, పార్టీ కార్యకర్తల సమావేశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక పోలీసులకు భద్రతకు సంబంధించిన పలు సూచనలను డిఎస్పి చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ టీం కూడా రాప్తాడులో పర్యటించారు. ఈనెల 22న లోకేష్ పాల్గొనబోయే కార్యక్రమాలు అన్నింటి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పర్యటిస్తారు.. ఏ సమయానికి వస్తారు.. వంటి అంశాల గురించి శ్రీరామ్ తో పాటు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పార్టీ శ్రేణులకు కొన్ని సూచనలు కూడా లోకేష్ టీం చేసింది. రాప్తాడు పర్యటనకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా శ్రీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలిరానున్నారని ఆయన చెప్పారు….

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News