రీసర్వే పనులను నాణ్యతతో, సమన్వయంతో పూర్తి చేయాలి: ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా ,ధర్మవరం

ధర్మవరం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రీసర్వే పనుల పురోగతిని ఆర్డీఓ రామ భూపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్డీవో మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా జరుగుతున్న భూ కొలతలు, జాయింట్ ఎల్‌పీఎంల విభజన, రికార్డుల పరిశీలన తదితర అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు వివరించగా, ఆయా సమస్యలకు నిబంధనల ప్రకారం పరిష్కారం చూపుతూ పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా జాయింట్ ఎల్‌పీఎంల విభజన సమయంలో సంబంధిత పట్టాదారుల హక్కులు, భూమి విస్తీర్ణం, క్షేత్రస్థాయి అనుభవం మరియు అందుబాటులో ఉన్న రికార్డులను సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు.
రీసర్వే పనుల్లో రెవెన్యూ, సర్వే సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని ఆర్డీఓ సూచించారు. ప్రతి భూమికి సంబంధించిన వివరాలు రికార్డుల్లో సక్రమంగా ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.అలాగే, రీసర్వే ప్రక్రియలో రైతులు మరియు గ్రామస్థుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. తమ భూములకు సంబంధించిన రికార్డులు, హక్కులు, విస్తీర్ణం లేదా సరిహద్దులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే, వాటిని రీసర్వే సిబ్బంది దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
రీసర్వే ద్వారా భూ రికార్డులను మరింత స్పష్టంగా, క్రమబద్ధంగా రూపొందించడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ, రైతులు, గ్రామస్థులు అధికారులకు సహకరించి రీసర్వే పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి తమ వంతు సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News