ఇంటింటా ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు
ప్రజలకు పూల శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తిమూర్తిపల్లి ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకున్న వైసీపీ నాయకులు
కదిరి, అక్టోబర్ 26: కదిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 41వ వార్డు మూర్తిపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ 41వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హేమావతిని, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మాక్బుల్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, పీఏసీ సభ్యుడు ఇస్మాయిల్, మైనార్టీ నాయకుడు సాధత్ అలీ, మాజీ టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



