ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్…. • శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ సతీష్ కుమార్.

ఏపీ అక్షర విజయం న్యూస్. :మున్సిపల్, జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా, ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, గొడవలకు దిగడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని రౌడీషీటర్లకు సూచించారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News