అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..

శ్రీ సత్య సాయి జిల్లా

ఏపీ అక్షర విజయం న్యూస్ | ఓబులదేవరచెరువు:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓబులదేవరచెరువు జెడ్పీటీసీ అభ్యర్థి మద్దె రాజు నాయుడు, ఎంపీపీ అభ్యర్థి కుర్లి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీపతి రెడ్డి, మైనార్టీ సీనియర్ నాయకుడు షామీర్ భాష, ఎస్సీ సెల్ నాయకుడు రామాంజనేయులు, ఓడీసీ-2 ఎంపీటీసీ అభ్యర్థి గంగులమ్మతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News