కార్యకర్తల కుటుంబాలకు అండగా జనసేన పార్టీ నాయకులు
పుట్టపర్తి, నవంబరు 15 (ఏపీ అక్షర విజయం):
పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలం బావిచెరువుపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గొర్ల రమేష్ అనారోగ్య కారణాలతో మూడు రోజుల క్రితం మృతి చెందడం బాధాకరమని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు.రమేష్ మృతి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు ఆయన స్వగ్రామానికి వెళ్లి భౌతికంగా దూరమైన రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకుల సహకారంతో సేకరించిన రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని తొట్ల గంగాధర్ చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడమే జనసేన పార్టీ ఆశయమని తెలిపారు. రమేష్ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ మేకల ఈశ్వర్, మార్కెట్ యార్డు చైర్మన్ పూల శివప్రసాద్, సొసైటీ చైర్మన్ కె. నరేష్, వెంకటేష్ నాయక్, గందోడి సతీష్, కరుణాకర్, అనిల్, ఉత్తప్ప, జగదీష్, కిషోర్, దినేష్, వేణు, కొండబోయిన సతీష్, డేరంగుల ఉపేంద్ర, చక్రపాణి, రామ్మోహన్, ధనుంజయ, జయసింహతో పాటు ఓడీసీ, అమడగూరు మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మృతుడు గొర్ల రమేష్ కుటుంబానికి జనసేన నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


