జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ ఎంపికలకు విశేష స్పందన

ఆరు విభాగాల్లో పోటీలు.. పాల్గొన్న 60 మంది దివ్యాంగ క్రీడాకారులు

ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం

ధర్మవరం, నవంబరు 15 (ఏపీ అక్షర విజయం):

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ ఎంపికలను ఆదివారం ధర్మవరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ ఎంపికలు నిర్వహించారు.మొత్తం ఆరు క్రీడా విభాగాల్లో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 60 మంది దివ్యాంగ క్రీడాకారులు హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ డాక్టర్ పి. పుల్లన్నతో పాటు పారా స్పోర్ట్స్ టెక్నికల్ కమిటీ సభ్యులు ఎన్. శ్రీనివాసులు, జి. శివప్ప ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి. కిషోర్ రాజు మాట్లాడుతూ దివ్యాంగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.ఎంపికల నిర్వహణలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) కోచ్‌లు హుస్సేన్, ఓం ప్రకాష్, ప్రతాప్, శబరిగిరితో పాటు డీఎస్ఏ సిబ్బంది పాల్గొని ఎంపికల ప్రక్రియను పర్యవేక్షించారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News