జర్నలిస్టుపై దాడికి యత్నించడం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ

బాధ్యుడైన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి: APWJF డిమాండ్

అనంతపురం:

చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కవరేజీకి వెళ్లిన వీకోట ఎన్టీవీ రిపోర్టర్ అక్రమ్‌పై పోలీసులు దాడికి యత్నించిన ఘటనను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది.

ఓటు వేసేందుకు వెళ్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా సీఐ స్థాయి అధికారి రిపోర్టర్‌పై దాడికి యత్నించడం అత్యంత దారుణమని ఫెడరేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు అని తెలిసినా కనీస విచక్షణ లేకుండా వ్యవహరించడం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కొందరు పోలీసుల అత్యుత్సాహం, అహంకారపూరిత చర్యల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని విమర్శించారు. ఎన్నికల వార్తల సేకరణ జర్నలిస్టుల హక్కు అని, విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులను అడ్డుకోవడం తగదని స్పష్టం చేశారు. ప్రజల ముందుకు నిజాలను తీసుకెళ్లే జర్నలిస్టులపై దౌర్జన్యాలకు పాల్పడితే ఫెడరేషన్ చూస్తూ ఊరుకోదని శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్అధ్యక్షులు శివరామకృష్ణ , ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. కె. చలపతి హెచ్చరించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యుడైన సీఐపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధపడతామన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News