షేక్ మౌలా అలీ , ఏపీ అక్షర విజయం ఎడిటర్ ఇన్ చీఫ్
శ్రీ సత్యసాయి జిల్లా ,పుట్టపర్తి
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంపీపీ ఎన్నికల సందడి!
32 మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక..
మెజారిటీ స్థానాల్లో టీడీపీ హవా
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లాలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), ఉపాధ్యక్షుల (వైస్ ఎంపీపీ) ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా సాగాయి.
జిల్లాలోని వివిధ మండలాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎంపిక చేస్తూ వివరాలు వెల్లడయ్యాయి. అత్యధిక మండలాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను దక్కించుకోగా, కొన్ని మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
ధర్మవరం మండలంలో బీజేపీ అభ్యర్థికి అధ్యక్ష పదవి దక్కింది.మండలాల వారీగా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు
1. బత్తలపల్లి: ఎంపీపీ – జి. నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ – బసిగొండ దీపిక (టీడీపీ).2. చెన్నేకొత్తపల్లి: ఎంపీపీ – డి. ఓబులేసు, వైస్ ఎంపీపీ – శీలం ఫణీంద్ర (టీడీపీ).3. ధర్మవరం: ఎంపీపీ – తాడిమర్రి శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ – అంగజాల రాజశేఖర్ (అధ్యక్షుడు బీజేపీ).4. కనగానపల్లి: ఎంపీపీ – యాతం పొతులయ్య, వైస్ ఎంపీపీ – జోగి అంజినప్ప (టీడీపీ).5. ముదిగుబ్బ: ఎన్నిక వాయిదా.6. రామగిరి: ఎంపీపీ – బి. సుధాకర, వైస్ ఎంపీపీ – కె. తిమ్మనాయుడు (టీడీపీ).7. తాడిమర్రి: ఎంపీపీ – కె. నాగవేణి, వైస్ ఎంపీపీ – జి. పద్మావతి (టీడీపీ).8. గాండ్లపెంట: ఎంపీపీ – బి. అంజనమ్మ, వైస్ ఎంపీపీ – సి. ఈశ్వరమ్మ (టీడీపీ).9. కదిరి: ఎంపీపీ – మూలే దీపాబాయి, వైస్ ఎంపీపీ – మహేష్ బాబు చిల్లా (టీడీపీ).10. ఎన్.పి. కుంట: ఎంపీపీ – కె. కోమలమ్మ, వైస్ ఎంపీపీ – నారాయణమ్మ (టీడీపీ).11. నల్లచెరువు: ఎంపీపీ – బొసిరెడ్డి అనిత, వైస్ ఎంపీపీ – జలపోగుల అంజనేయులు (టీడీపీ).12. తలుపుల: ఎంపీపీ – మేడె రెడ్డమ్మ, వైస్ ఎంపీపీ – బెట్టాల మంజుల (టీడీపీ).13. తనకల్లు: ఎంపీపీ – బచ్చల్లి రేమాదేవి, వైస్ ఎంపీపీ – పి. నారాయణ (టీడీపీ).14. అగళి: ఎంపీపీ – గొంగమ్మ, వైస్ ఎంపీపీ – జె. రాజన్న (టీడీపీ).15. అమరాపురం: ఎంపీపీ – హెచ్. జాలా లక్ష్మి, వైస్ ఎంపీపీ – ఎం. నాగరాజు (టీడీపీ).16. గుడిబండ: ఎంపీపీ – టి. అంతిలమ్మ, వైస్ ఎంపీపీ – డి. శ్రీనాథమూర్తి (టీడీపీ).17. మడకశిర: ఎంపీపీ – పి.ఆర్. అనురాధ, వైస్ ఎంపీపీ – కె. శారద (టీడీపీ).18. రొళ్ల: ఎంపీపీ – ఎస్.బి.ఎల్.బి. శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ – ఈ. స్మిల్ప (టీడీపీ).19. అమడగూరు: ఎంపీపీ – పిచికుంట్ల వెంకట రమణ, వైస్ ఎంపీపీ – మద్దిమడుగు సుజాతమ్మ (టీడీపీ).20. బుక్కపట్నం: ఎంపీపీ – నాగమణి పాలగర్ల, వైస్ ఎంపీపీ – సి. చెన్నయ్య (వైఎస్సార్సీపీ).21. కొత్తచెరువు: ఎంపీపీ – ఎం. మహాలక్ష్మి, వైస్ ఎంపీపీ – సాకు లక్ష్మీదేవి (వైఎస్సార్సీపీ).22. నల్లమాడ: ఎంపీపీ – స్రీసైలం నవ్యశ్రీ, వైస్ ఎంపీపీ – కాగానిపల్లి శ్రీవాణి (వైఎస్సార్సీపీ).23. ఓబులదేవరచెరువు: ఎంపీపీ – పిట్టా ఓబులరెడ్డి (టీడీపీ), వైస్ ఎంపీపీ – కటపల్లి హరిత (వైఎస్సార్సీపీ).24. పుట్టపర్తి: ఎంపీపీ – నల్లపుసల నాగవేణి, వైస్ ఎంపీపీ – వడుదుల లక్ష్మీబాయి (టీడీపీ).25. చిలమత్తూరు: ఎంపీపీ – జి. గీతమ్మ, వైస్ ఎంపీపీ – జి.ఎస్. సాయిజప్ప (టీడీపీ).26. గోరంట్ల: ఎంపీపీ – జి. నరేష్ కుమార్, వైస్ ఎంపీపీ – సి.డి. నిడిమామిడప్ప (టీడీపీ).27. హిందూపురం: ఎంపీపీ – ఎన్. మునిరాజు, వైస్ ఎంపీపీ – ఎన్.టి. అశోక్ కుమార్ (టీడీపీ).28. లేపాక్షి: ఎంపీపీ – సి.కె. ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ – సలేహా (టీడీపీ).29. పరిగి: ఎంపీపీ – కాపుసెట్ట శాంతమ్మ, వైస్ ఎంపీపీ – కె. తుగ్రాజు (టీడీపీ).30. పెనుకొండ: ఎంపీపీ – దొండు మమత, వైస్ ఎంపీపీ – ఎం. లక్ష్మీదేవి (టీడీపీ).31. రొద్దం: ఎంపీపీ – కె. మంజు, వైస్ ఎంపీపీ – సి. వాణి (టీడీపీ).32. సోమందేపల్లి: ఎంపీపీ – ఎన్. చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ – డ్రైవర్ లోకేంద్ర (టీడీపీ).రాజకీయంగా ఆసక్తికరంగా మారిన ఎన్నికలుజిల్లాలోని పలు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల కోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ముఖ్యంగా సమాన బలం ఉన్న ఓబులదేవరచెరువు మండలంలో లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకోవడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది.నల్లమాడ మండలంలో 8 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీల బలంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను ఆ పార్టీ దక్కించుకుంది.మొత్తంగా శ్రీ సత్యసాయి జిల్లా మండల పరిషత్ రాజకీయాల్లో టీడీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, వైఎస్సార్సీపీ కూడా కొన్ని మండలాల్లో తన పట్టును నిలబెట్టుకుంది.


