పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ఎస్వీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి

శ్రీ సత్యసాయి జిల్లా , పెనుకొండ

పెనుకొండ పట్టణంలోని ఎస్వీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పథకం మంజూరైన నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడిన మంత్రి, పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.ప్రజలు ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్య చికిత్సలు పొందాలని మంత్రి సవిత సూచించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News