నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ జాతీయ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి

అమరావతి

విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని బీజేపీ జాతీయ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నూతన పుస్తకాన్ని నారా లోకేష్ గారికి బహుమతిగా అందజేశారు.అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించారని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఈ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు కూటమి పార్టీలకు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి నేతలు కృషి చేస్తారని పేర్కొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News