హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానం వాల్మీకులకు కేటాయించాలి

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో వాల్మీకులకు అన్యాయం జరిగిందని ఆవేదన

వాల్మీకి భవన్‌లో సంఘం నాయకుల విలేకరుల సమావేశం

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం:

హిందూపురం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో వాల్మీకి సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని వాల్మీకి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హిందూపురంలోని వాల్మీకి భవన్‌లో వాల్మీకి సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 45 వేల మంది వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఉన్నారని నాయకులు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో తమ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత లభించలేదని పేర్కొన్నారు. వాల్మీకులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వాల్మీకి సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. ముఖ్యంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని వాల్మీకులకు కేటాయించి, తమ సామాజికవర్గానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకుల జనాభా, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో వాల్మీకి సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, గౌరవ అధ్యక్షుడు ఆదినారాయణ, కార్యదర్శి లోకేష్, ట్రెజరర్ ఆకుల తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News