శ్రీ సత్యసాయి జిల్లా,ఓబుళదేవరచెరువు:
అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ఉపాధి పథకం కూలీల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకొని అక్రమంగా బిల్లులను స్వాహా చేసిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆర్సిపి డివిజన్ కార్యదర్శి మున్నా డిమాండ్ చేశారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ఆర్ సి పి నాయకులు ఉపాధి బిల్లులు అనర్హుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని, వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులకు హాజరుకాని అధికార పార్టీ చెందిన బడా నాయకులకు బిల్లులు ఎలా ఇస్తారని ఉపాధి హామీ టెక్నికల్, క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధి బిల్లుల దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టి, రికవరీ చేయాలన్నారు. అలాగే ఉపాధి సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీడీవో శివరాం ప్రసాద్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.



