బ్యాంకుల సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆర్‌బీఐ చర్యలు
ఈ నెల 27 (ఆదివారం) బ్యాంకులు సాధారణ పని వేళల్లో పనిచేస్తాయి వరుస సెలవులు మరియు సమ్మె పిలుపు కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడకుండా, ఖాతాదారుల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 27వ తేదీ (ఆదివారం) బ్యాంకులు సాధారణ వేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) ఫణింద్ర కుమార్ తెలిపారు.ఈ నెల 26వ తేదీ (4వ శనివారం), 27వ తేదీ (ఆదివారం) సాధారణ సెలవు దినాలు. అనంతరం, బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘యునైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూనియన్స్’ పిలుపు మేరకు ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు (మూడు రోజులు) బ్యాంకుల సమ్మె కొనసాగనుంది.వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూత పడితే ప్రజలకు నగదు కొరత ఏర్పడటంతో పాటు లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, అలాగే అక్టోబర్ 1న జరిగే పింఛన్ల పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 27న ఆదివారం నాడు బ్యాంకులు మరియు కరెన్సీ చెస్ట్‌లు సాధారణ పని వేళల ప్రకారం పనిచేసేలా ఆదేశాలు జారీ చేసింది.ఆదివారం బ్యాంకులు పనిచేయడం వల్ల ఖాతాదారులకు మరియు పింఛనుదారులకు అవసరమైన నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సెలవులు మరియు సమ్మె సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని ముఖ్యమైన బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు మరియు ఏటీఎమ్‌లలో తగినంత నగదును నిల్వ ఉంచుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించిందని ఎల్‌డీఎం తెలిపారు.


