మహిళా ఉద్యోగులపై వేధింపుల,ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి**బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లాలోనే బీసీ వెల్ఫేర్ మహిళా ఉద్యోగస్తుల పై జిల్లా అధికారి వేధింపులు బీసీ సంక్షేమ శాఖ డీడీపై ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి*శ్రీ సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లలో పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగులను మానసికంగా, అసభ్యకరంగా బీసీ వెల్ఫేర్ డిడి రాజేంద్ర కుమార్ రెడ్డి వేధిస్తున్నారని బీసీ సంక్షేమ మహిళా ఉద్యోగస్తులలో ప్రచారం జరుగుతున్నది ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ధర్మవరం పట్టణం నుంచి పత్రికా ప్రకటన ద్వారా అల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య డిమాండ్ చేశారు. సత్య సాయి జిల్లా బీసీ సంక్షేమ హాస్టల్లో హెచ్ డబ్ల్యు ఓ లు గా పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు కొంతమంది మహిళ ఉద్యోగస్తులకు సోకాజ్ నోటీసులు, మెమొలు జారీ చేయడం, విధులలో వారిని ఇబ్బందులు పెట్టడం,సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లో మహిళా ఉద్యోగస్తులకు కొన్ని అసభ్యకర కామెంటులను పెడుతున్నారని. మహిళా ఉద్యోగస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న బీసీ వెల్ఫేర్ డిడి రాజేంద్ర కుమార్ రెడ్డి ని తక్షణమే సస్పెండ్ చేయాలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారి జిల్లాలోని ఈ రకంగా మహిళ ఉద్యోగస్తులను వేధిస్తున్నటువంటి జిల్లా అధికారి డిడి పైన మంత్రి సవిత వెంటనే స్పందించి మహిళా ఉద్యోగస్తులకు అండగా నిలవాలి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన డిడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు


