27 నుండి 30 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి

శ్రీ సత్యసాయి జిల్లాలో 2026 సంవత్సరానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్ల కోసం పాఠశాలలు, కళాశాలల భవనాలను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో పంపిణీ, స్వీకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా మరియు పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న పాఠశాలలు, కళాశాలలకు క్రింది తేదీల్లో సెలవులు ప్రకటించడమైనది.27-10-2026: పోలింగ్‌కు ముందు రోజు.28-10-2026: పోలింగ్ రోజు.29-10-2026: ఓట్ల లెక్కింపునకు ముందు రోజు.30-10-2026: ఓట్ల లెక్కింపు రోజు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సజావుగా చేపట్టేందుకు, పై తేదీల్లో సంబంధిత పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు వర్తిస్తాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News