జిల్లావ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా…
నామినేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితులను, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పోలీసు అధికారులకు, సిబ్బందికి వైర్లెస్ ద్వారా తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల నియమ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం, జనసమూహాలను నియంత్రించడం, వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.




