శ్రీ సత్యసాయి జిల్లా , ఓడిచెరువు
మండలంలో వైసీపీ కీలక నేతగా ఎదిగిన కోళ్ల కృష్ణారెడ్డి…
వైసిపి ఆవిర్భావం నుండి… పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు..
ఓడిచెరువు: ఓడిచెరువు మండల ఎంపీపీ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోళ్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ, క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు మండలంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృష్ణారెడ్డి అహర్నిశలు కృషి చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓడిచెరువు మండలంలో వైసీపీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు.
రెండు పర్యాయాలు వైసీపీ మండల కన్వీనర్‌గా సేవలందించిన కృష్ణారెడ్డి, పార్టీలకు అతీతంగా ప్రజలకు తనవంతు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పనిచేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందని అనుచరులు చెబుతున్నారు.
గత రెండు దశాబ్దాలుగా వైసీపీకి అండగా నిలుస్తూ, పార్టీ కార్యక్రమాల కోసం కష్టపడుతున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో ఉంది. ప్రతి ఎన్నికల్లో పార్టీ కోసం సేవలను వినియోగించుకుని, అనంతరం విస్మరించారనే ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీపీ రేసులో కోళ్ల కృష్ణారెడ్డి బరిలో నిలవడం పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఈసారి ఆయన సేవలను గుర్తించి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.


