స్పీడ్ అందుకున్న ఫ్యాన్ – ఓబులదేవరచెరువులో వైసీపీ విస్తృత ప్రచారం..

శ్రీ సత్యసాయి జిల్లా, ఓబులదేవర చెరువు

కూటమి హామీల అమలుపై జెడ్పీటీసీ అభ్యర్థి మద్దే రాజు నాయుడు విమర్శలు

• పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. గత ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను కలిసిన వైసీపీ నాయకులు

ఏపీ అక్షర విజయం న్యూస్, అక్టోబర్ 29, ఓబులదేవరచెరువు:

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మండలంలోని తిప్పేపల్లి, చింతమానుపల్లి, కొండకమర్ల, అల్లాపల్లి, ఇనుగలూరు, సున్నంపల్లి తదితర గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటూ తమ పార్టీ విధానాలు, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

• కూటమి హామీల అమలుపై విమర్శలు..

ఈ సందర్భంగా వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మద్దే రాజు నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో వెనుక బడిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు అందిస్తామన్న హామీలు అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చకపోవడంతో గత మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

• గత ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం

వైసీపీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, పింఛన్ కానుక, ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయా పథకాల ద్వారా విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఇతర అర్హులైన కుటుంబాలకు ప్రయోజనాలు అందాయని తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశామని నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందాల్సిన సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని ప్రచారంలో వివరించారు.

• ప్రజా సమస్యలే ప్రధాన అంశాలుగా ప్రచారం..

గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాల వంటి స్థానిక సమస్యలను , ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి మేము ఎప్పుడూ ముందుంటామన్నారు. గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల (నవరత్నాలను) అమలును, తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని జెడ్పీటీసీ అభ్యర్థి మద్దే రాజు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలిశారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News