నల్లచెరువు మండల కేంద్రంలోని ఫీవర్స్ కాలనీలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ ఆధ్వర్యంలో బుధవారం వినాయక చవితి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కాలనీ వాసులు, యువత మరియు యూత్ లీడర్ బాబ్జాన్ ఆధ్వర్యంలో నిసార్ యాసిన్ ఖాన్కు ఘన స్వాగతం పలికారు. వీవర్స్ కాలనీ ప్రజల కోరిక మేరకు వినాయక విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని నిసార్ యాసిన్ ఖాన్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిసార్ యాసిన్ ఖాన్ మాట్లాడుతూ, వినాయక చవితి కులమతాలకు అతీతంగా పెద్దలు, పిల్లలు కలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పిల్లాపాపలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.వినాయక విగ్రహ ఏర్పాటుకు సహకరించిన వీవర్స్ కాలనీ పెద్దలు, యువత మరియు నిర్వాహకులకు నిసార్ యాసిన్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ బాబ్జాన్, హోటల్ రాంప్రసాద్, చేనేత మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పూలకుంట మహమ్మద్, వార్డు మెంబర్లు శంకర, అల్లుగుండు చంద్ర, బాబ్జాన్ తదితరులతో పాటు వీవర్స్ కాలనీ వాసులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



