శ్రీ సత్య సాయిజిల్లా, ధర్మవరం టౌన్
ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన ముఠాను ధర్మవరం సబ్ డివిజన్ పోలీసులు చేదించడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో ఎస్పీతోపాటు డిఎస్పి బీవీ జగన్నాథ రాజుతో కలిసి వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం సబ్-డివిజన్ పరిధిలోని ధర్మవరం రూరల్, బత్తలపల్లి, కనగానపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస ఆలయ చోరీ కేసులను పోలీసులు ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసామని, వారి వద్ద నుంచి మొత్తం రూ.20,35,300/- విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో ధర్మవరం రూరల్ సీఐ శ్రీ ఎన్. ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామని, ధర్మవరం రూరల్ పీఎస్ ఎస్ఐ జె. రాజశేఖర్, చెన్నేకొత్తపల్లి పీఎస్ ఎస్ఐఐ సత్యనారాయణ, పట్నం పీఎస్ ఎస్ఐ అర్షద్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు అని తెలిపారు. సెప్టెంబర్ 9వ తేదీ
ధర్మవరం మండలం కునుతూరు గ్రామ శివారులోని కామిరెడ్డిపల్లి క్రాస్ రోడ్, ఎస్ఎల్వీ రైస్ మిల్ సమీపంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు.అరెస్టయిన నిందితులులో సిల్లా నాగరాజు, బీసీ కాలనీ, పోతుకుంట, ధర్మవరం మండలం.చింతకాయల నవీన్ కుమార్ , కుమ్మరి వీధి, బుక్కపట్నం.
సిల్లా శివ బీసీ కాలనీ, పోతుకుంట, ధర్మవరం మండలం అని తెలిపారు.
నిందితుల నుండి-వెండి వస్తువులు – 6 కిలోల 750 గ్రాములు, విలువ సుమారు రూ.18,90,000/-,-ఇత్తడి వస్తువులు – సుమారు 40 కిలోలు, విలువ సుమారు రూ.40,000/-,
ఉరుము (డోలు) – రూ.15,000/-,
6 యాంప్లిఫైయర్లు – రూ- 25,90,000/-,స్వాధీనం చేసుకున్న మొత్తం చోరీ సొత్తు విలువ: రూ.20,35,300/-కలదని తెలిపారు.
అలాగే చోరీలకు ఉపయోగించినట్లు భావిస్తున్న కట్టర్, పల్సర్ మోటార్ సైకిల్, టీవీఎస్ జూపిటర్ స్కూటీ, టీవీఎస్ ఎక్స్ఎల్-100 మోపెడ్ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఏడు ఆలయాల చోరీ కేసుల దర్యాప్తులో నిందితులు ధర్మవరం రూరల్, బత్తలపల్లి, కనగానపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 7 ఆలయ చోరీ కేసులకు పాల్పడినట్లు వెల్లడైంది అని తెలిపారు.
నిందితులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. సులభంగా, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రి సమయంలో ఆలయాల వద్ద ఎవరూ ఉండరనే విషయాన్ని ఆసరాగా చేసుకుని ధర్మవరం పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో వరుసగా చోరీలకు పాల్పడ్డారు అని తెలిపారు.
దీంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, 7 ఆలయ చోరీ కేసులను ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు
ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆలయ నిర్వాహకులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం
చోరీ సొత్తును రికవరీ చేసిన ధర్మవరం డీఎస్పీ బి.వి. జగన్నాథ రాజు, ధర్మవరం రూరల్ సీఐ ఎన్. ప్రభాకర్, ఎస్ఐ జె. రాజశేఖర్, ప్రత్యేక బృందాల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


