శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తి :
పుట్టపర్తి, అక్టోబర్ 18: ఈనెల( రేపు)19వ తేదీ సోమవారం రోజున స్థానిక సంస్థల ఎన్నికలు మరియు మహర్నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో, పుట్టపర్తి రెవెన్యూ భవన్లో నిర్వహించాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరారు.అర్జీలు సమర్పించేందుకు ఎవరూ కూడా సోమవారం రోజున రెవెన్యూ భవన్కు రావద్దని సూచించారు.అదేవిధంగా, క్షేత్రస్థాయిలో కూడా ఎటువంటి పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించడం జరగదని స్పష్టం చేశారు.


