రాయదుర్గం అభివృద్ధే నా ఆశ.. నా ధ్యాస : ఎమ్మెల్యే కాలవ.

అనంతపురం జిల్లా, రాయదుర్గం,

:రాయదుర్గం పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో గురువారం 22వ వార్డులో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత రెండేళ్ల కాలంలో రూ.13 కోట్లను రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. తాగునీటి సరఫరా కోసం అమృత్‌-2 పథకం కింద రూ.78 కోట్లతో విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు. కనేకల్లు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నుంచి రాయదుర్గం వరకు కొత్త పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల భవిష్యత్తులో లీకేజీ సమస్యను పూర్తిగా అరికట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.అర్ధాంతరంగా ఆగిపోయిన అనంతపురం-రాయదుర్గం రైల్వే వంతెన నిర్మాణానికి రూ.46 కోట్లు మంజూరు చేయించామని, టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో రూ.30 కోట్ల విలువైన రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని, ఇందుకు టెండర్లు కూడా ఆహ్వానించారని తెలిపారు. ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. వీటితోపాటు ప్రత్యేకంగా మరో రూ.25 కోట్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే రాయదుర్గం పట్టణంలో రూ.200 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు అయిదేళ్ల కాలంలో చేపట్టే అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇంత భారీ మొత్తంలో గతంలో ఎప్పుడూ రాయదుర్గం పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులు, పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో రాయదుర్గానికి పెద్దఎత్తున నిధులు తీసుకురాగలుగుతున్నామని చెప్పారు. పేదల పక్కా గృహాల కోసం రాయదుర్గానికి ప్రత్యేకంగా అదనపు ఇళ్లు మంజూరు చేయించుకోగలుగుతున్నామన్నారు. వీటితోపాటు అర్ధాంతరంగా ఆగిపోయిన టిడ్కో బహుళ అంతస్తుల గృహ నిర్మాణ సముదాయాల పనులను కూడా తిరిగి ప్రారంభించామన్నారు. రాయదుర్గం పట్టణంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రగతికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏ ఒక్క వార్డులోనైనా కూటమి అభ్యర్థులకు బదులుగా వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఆ వార్డులో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందని గుర్తు చేశారు. తాను తీసుకొచ్చిన నిధులను కూడా గత పాలకవర్గం సక్రమంగా, సకాలంలో ఖర్చు చేయడానికి సహకరించలేదని విమర్శించారు. వైసీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని, వారికి నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను వినియోగంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం మాత్రమే వారికి తెలుసని విమర్శించారు. అందువల్ల అభివృద్ధి నిరోధకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని రాయదుర్గం పట్టణ ప్రజలకు కాలవ విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో తనకు ఎవరికి, ఎప్పుడూ ఇవ్వనంత 16వేల మెజారిటీని రాయదుర్గం పట్టణ ప్రజలు అందించారని గుర్తు చేశారు. రాయదుర్గం పట్టణాన్ని మిగతా పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేయడమే తన ఆశ, ధ్యాస అని తెలిపారు. ప్రజలు ఇప్పటివరకు అందిస్తున్న సహకారాన్ని ఇదే విధంగా కొనసాగించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వినమ్రంగా విన్నవించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, వార్డ్ ఇంచార్జి హరిజన ఆనంద్, మల్లికార్జున, నాయకులు టoకశాల హనుమంతు, పోరాళ్ల పురుషోత్తం,బంగి శంకర్, వేణు,ధనర్జున,రామంజి,బుదురు తిప్పేస్వమి, పద్మజ,ప్రశాంతి, సంపత్ కుమారి, రావుత్ రాజశేఖర్,ఎల్లప్ప,లోకేష్, పైతోట అంజి,తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News