శాలువా, పూలమాలతో అభినందించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్. చంద్రశేఖర్
శ్రీ సత్యసాయి జిల్లా (ఏపీ అక్షర విజయం)మడకశిర:
మడకశిర మండల జడ్పీటీసీగా విజయం సాధించిన గుండుమల చంద్రప్పను బీజేపీ రాష్ట్ర నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మడకశిర నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు డైరెక్టర్ ఎమ్మెస్ రాజు, మాజీ శాసనమండలి సభ్యుడు గుండుమల తిప్పేస్వామి ఆశీర్వాదంతో జడ్పీటీసీగా విజయం సాధించిన గుండుమల చంద్రప్పను ఆయన స్వగ్రామమైన గుండుమలలోని స్వగృహంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చంద్రప్పకు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. మున్ముందు మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి మడకశిర మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్, జనసేన సీనియర్ నాయకుడు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సి.ఎల్. లెంకప్ప, హనుమంతు, గోపి, రామాంజనేయులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



