బాలికల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన : కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

పుట్టపర్తి, నవంబర్ 13 (ఏపీ అక్షర విజయం న్యూస్):బాలికల సాధికారతే సమాజ సమగ్ర అభివృద్ధికి పునాది అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేల చొప్పున నగదు చెక్కులను కలెక్టర్ అందజేశారు.గత సెప్టెంబర్ 29న కదిరిలోని ఎస్.టి.ఎస్.ఎన్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం, సాధికారత, లింగ సమానత్వంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు.జిల్లాలోని కదిరి, హిందూపురం, మడకశిర, బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు రూపొందించిన లఘు చిత్రాలు పోటీల్లో ప్రదర్శించారు. బాల్యవివాహాల నిర్మూలన, బాలికల అక్రమ రవాణా, భ్రూణహత్యలు, లింగ వివక్ష, సైబర్ నేరాలు తదితర సామాజిక సమస్యలపై రూపొందించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి.పోటీల విజేతలు:ప్రథమ బహుమతి: కదిరి ఎస్.టి.ఎస్.ఎన్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎస్. బాషా రూపొందించిన ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ లఘు చిత్రం.ద్వితీయ బహుమతి: హిందూపురం ఎన్.ఎస్.పి.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్. గౌతమి రూపొందించిన ‘బాలికల అక్రమ రవాణా’ లఘు చిత్రం.తృతీయ బహుమతి: మడకశిర ఎస్.వై.టి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పి. రజియా బాను రూపొందించిన ‘ఆన్‌లైన్ సైబర్ నేరాలు’ లఘు చిత్రం.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. ఫీరోజా బేగం, డాక్టర్ మహేశ్వర మారుతి, సీడీపీఓ జయంతి, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యార్థులు, వాలంటీర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.బాలికలకు నాణ్యమైన విద్య అందించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News