పుట్టపర్తిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం… మున్సిపాలిటీలో రూ.182 కోట్లతో పలు అభివృద్ధి పనులు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ,

పుట్టపర్తిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం..

•మున్సిపాలిటీలో రూ.182 కోట్లతో పలు అభివృద్ధి పనులు

•ఎమ్మెల్యే పల్లె సింధూర ప్రత్యేక కృషితో పుట్టపర్తి

•స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం.

పుట్టపర్తి బిల్డర్లు తో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి


పుట్టపర్తి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బిల్డర్లతో పుట్టపర్తి సాయి ఆరామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బిల్డర్లకు ఎదురవుతున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృషితో పుట్టపర్తి మున్సిపాలిటీలో సుమారు రూ.182 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులతో పాటు పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు పట్టణంలో ఆధునిక మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారవేత్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే పట్టణ అభివృద్ధికి మరింత వేగం వస్తుందని, బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.
పుట్టపర్తి అభివృద్ధిలో బిల్డర్లు కూడా భాగస్వాములు కావాలని, నిబంధనలను పాటిస్తూ నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి పట్టణ ప్రగతికి సహకరించాలని ఆయన కోరారు

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News