జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష , అధికారులకు కీలక ఆదేశాలు జారీ : కలెక్టర్ శ్యాం ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి,


జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
అధికారులకు కీలక ఆదేశాలు జారీ : కలెక్టర్ శ్యాం ప్రసాద్


కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండా ప్రకారం వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. • మంచినీటి సరఫరా: జిల్లాలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా తాగునీటి సరఫరా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

స్వచ్ఛతా హి సేవా ప్రచారం : స్వచ్ఛతా హి సేవా ప్రచార కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత మరియు పారిశుధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలన్నారు.

ప్రతికూల వార్తలు: పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై స్థానిక అధికారులు తక్షణమే స్పందించి సరైన వివరణ మరియు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రాజెక్టు (రాయలసీమ హార్టికల్చర్ హబ్): ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికలు: ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పిఎం సూర్య ఘర్ : సోలార్ విద్యుత్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

గృహనిర్మాణ పథకం: పేదల గృహనిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పింఛన్లు: అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ సజావుగా జరగాలని సూచించారు.
పి4 సేవలు: స్థానిక పాలన మరియు సేవలను మరింత వేగవంతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులు, ఎస్ జి ఎస్ డబ్ల్యూ నోడల్ ఆఫీసర్, జడ్పీ సీఈఓ, డి డి ఓలు, డి ఎల్ పి ఓ లు, ఎంపీడీవోలు , డిప్యూటీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, ఏ ఈ ఈ లు ఏపీ ఎస్పీడీసీఎల్ డి ఈ ఈ లు , ఏఈ లు , డి ఆర్ డి ఏ పిడి, హౌసింగ్ డిఈఏఈ పలు విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News