గ్రామ ప్రజల సమస్యపై తక్షణ స్పందన — ఐదు నిమిషాల్లో విద్యుత్ పునరుద్ధరణ

అనంతపురం , పామిడి:–

పామిడి మండలం రామగిరి గ్రామంలో విద్యుత్ సరఫరా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు విద్యుత్ శాఖ ఎల్‌ఐ తిరుపాల్ నాయక్ దృష్టికి రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.గ్రామ ప్రజల నుంచి సమాచారం అందిన వెంటనే ఎల్‌ఐ తిరుపాల్ నాయక్ స్పందించి, సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. దీంతో కేవలం ఐదు నిమిషాల్లోనే గ్రామంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. ప్రజల సమస్యను వెంటనే గుర్తించి, ఆలస్యం చేయకుండా స్పందించి పరిష్కరించడంపై రామగిరి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించిన లైన్ మ్యాన్ తిరుపాల్ నాయక్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News