క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యల పరిష్కారాలపై అభిప్రాయాలను తెలుపగలరు : జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి:-

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తమ అభిప్రాయాలను, స్పందనను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు ప్రజా సంతృప్తిని నిరంతరం సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మరియు మండల స్థాయిలోని అన్ని పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల వద్ద, వివిధ శాఖల ద్వారా అర్జీలు, సర్వేలు, దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు పీజీఆర్‌ఎస్‌ సేవలు పొందిన వెంటనే తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి సేవలపై ఫీడ్‌బ్యాక్‌ సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం రేవెన్యు భవన్తో పాటు మండల కార్యాలయాల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించి, అనంతరం ఫీడ్‌బ్యాక్‌ అందించడం ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకునేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100 కు కాల్‌ చేయవచ్చని సూచించారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News