ఏపీ అక్షర విజయం న్యూస్, కదిరి:

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల జెడ్పీటీసీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లచెరువు మండలంలోని శ్రీ శ్రీ శ్రీ పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి ఆలయంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


