అక్టోబర్ 30 నుంచి నవంబర్ 01 వరకు, నవంబర్ 3న మద్యం దుకాణాలు మూసివేత

శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి

శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో, ఎన్నికలు జరిగే సంబంధిత పోలింగ్ ప్రాంతాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం, 2026 నవంబర్ 01వ తేదీన పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల పాటు, అంటే అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 05 గంటల నుంచి నవంబర్ 01 తేదీ సాయంత్రం 05 గంటల వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలి.

అదేవిధంగా, ఓట్ల లెక్కింపు జరిగే రోజున (నవంబర్ 3న) కూడా ఉదయం 08 గంటల నుండి సంబంధిత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది.

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత ప్రాంతాల్లోని మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా సహకరించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సూచించింది.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News