రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్

రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సంయుక్త ఆపరేషన్

రెండు కేసులు ఛేదించి రూ.13.15 లక్షల సొత్తు స్వాధీనం

19 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Anantapur District, గుంతకల్లు, నవంబరు 17 (ఏపీ అక్షర విజయం):

రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని గుంతకల్లు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 19 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు వేర్వేరు కేసులను ఛేదించారు. అతడి వద్ద నుంచి మొత్తం రూ.13.15 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

గుంతకల్లు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన ముదిరిన ప్రసాంగి అలియాస్ లక్కీ, వెంకీ కొంతకాలంగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగులు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లను అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసిన రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.

ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో రూ.12.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్‌ను రికవరీ చేశారు. మరో కేసుకు సంబంధించి రూ.70 వేల విలువైన అపాచీ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో కలిపి మొత్తం రూ.13.15 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు రైల్వే సీఐ కె. అజయ్ కుమార్ తెలిపారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News