తొలి రోజు 422 నామినేషన్లు దాఖలు.

సర్పంచ్ స్థానాలకు 193.. వార్డు సభ్యులకు 229 నామినేషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం, నవంబరు 15 (ఏపీ అక్షర విజయం):

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో తొలి రోజు మొత్తం 422 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా గ్రామ పంచాయతీ అధికారి విడుదల చేసిన ప్రోఫార్మా-2 నివేదిక ప్రకారం సర్పంచ్ పదవులకు 193, వార్డు సభ్యుల పదవులకు 229 నామినేషన్లు నమోదయ్యాయి.సర్పంచ్ స్థానాలకు సంబంధించి ధర్మవరం మండలంలో అత్యధికంగా 39 నామినేషన్లు దాఖలు కాగా, ముదిగుబ్బలో 35, కనగానపల్లిలో 34, సీకే పల్లిలో 31, బత్తలపల్లిలో 24, రామగిరిలో 19, తాడిమర్రిలో 11 నామినేషన్లు వచ్చాయి.అదేవిధంగా వార్డు సభ్యుల స్థానాలకు రామగిరి మండలంలో అత్యధికంగా 61 నామినేషన్లు దాఖలయ్యాయి. ధర్మవరంలో 42, కనగానపల్లిలో 41, ముదిగుబ్బలో 31, సీకే పల్లిలో 28, బత్తలపల్లిలో 23, తాడిమర్రిలో 3 నామినేషన్లు నమోదయ్యాయి.మొత్తంగా తొలి రోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 422 నామినేషన్లు దాఖలైనట్లు నివేదిక వెల్లడించింది. నవంబరు 15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News