ఏపీ అక్షర విజయం న్యూస్, నవంబర్ 09, కనేకల్లు :కనేకల్ మండలం జడ్పిటిసిగా గెలుపొందిన ఆదినారాయణ మరియు ఎంపీటీసీగా గెలిచి కాబోయే ఎంపీపీ సుదర్శన్ ని బలిజ కులస్తులు శాలువాలు, పూల మాలలు వేసి ఆదివారం సన్మానించారు. ఏడో తేదీ ఎలక్షన్ కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పిటిసిగా గెలుపొందిన ఆదినారాయణ మరియు ఎంపీటీసీగా గెలుపొంది కనేకల్లు మండల ప్రజా పరిషత్ మండల అధ్యక్షులుగా (ఎంపిపి) గా సుదర్శన్ మరియు మండల కన్వీనర్ వన్నారెడ్డిని మర్యాదపూర్వకంగా సన్మానించినట్లు బలిజ కులస్తులు తెలిపారు. మండలం అభివృద్ధి చెందాలంటే మండలానికి కావలసిన నిధులను సమకూర్చాలంటే మండలం పాలన సక్రమంగా జరగాలంటే జడ్పిటిసి ఎంపీపీ కీలక బాధ్యత వహిస్తారు అన్నారు. కనేకల్ మండలం అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపా ప్రకాష్, నాగిరెడ్డిపల్లి ప్రసాద్, గుడి గుండ్ల గంగాధర సద్దల రాజన్న, దత్త కిష్టప్ప, తిమ్మప్ప నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నాయకులను సన్మానించారు


