అనంతపురం జిల్లా, ఏపీ అక్షర విజయం న్యూస్, నవంబర్ 9,కనేకల్లు :
మండల స్థాయిలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సందర్బంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, మరియు క్విజ్ లలో ఎర్రగుంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు హేమలత (9వ తరగతి), వేదితా బాయి (8వ తరగతి) నియోజకవర్గం స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గుత్తి డివిజన్ డిప్యూటీ డీ.ఈ.ఓ లక్ష్మణ్, కణేకల్ మండలం ఏం.ఈ.ఓ_2 భవానీశంకర్, హెచ్.ఏం వేణుగోపాల్ మరియు యర్రగుంట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ విద్యార్థులకు, ఉపాధ్యాయురాలు షానుజా కు అభినందనలు తెలిపారు. విద్యార్థుల ఎంపికపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసారు.


