ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అభినందనలు1
శ్రీ సత్యసాయి జిల్లా (ఏపీ అక్షర విజయం) పుట్టపర్తి:
తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా నల్లమాడ జడ్పీటీసీ అభ్యర్థి సరోజమ్మ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సభ్యులు సోమ్లా నాయక్, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, మైలే శంకర్ తదితరులు పుట్టపర్తిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ప్రజలకు వివరించి ప్రచారం నిర్వహించిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించడంతో పాటు, ఓటమి చెందిన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ సర్పంచ్ ఎన్నికల్లో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సభ్యులు సోమ్లా నాయక్, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, సలాం ఖాన్, ఎస్.డి. రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మణికుమారి, గన్ రెడ్డి, రషీద్ ఖాన్, నల్లమాడ ఎంపీటీసీ అభ్యర్థులు అత్తర్ జాన్, రాంప్రసాద్, అరుణ భాయి, శ్రీరాములు, బాబావాలి, విశ్వనాథ్, భువనేశ్వర్ రెడ్డి, శేఖర్, విష్ణు, వెంకట రమణ, శివారెడ్డి, జనార్ధన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


