శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి,
రాబోవు గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్
మునిసిపాలిటీ, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఉద్యోగులందరిని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభినందించారు.శ్రీ సత్య సాయి జిల్లాలో ఇటీవల పూర్తయిన మునిసిపాలిటీ మరియు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు సచివాలయ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.ఈ నెలలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఇదేవిధంగా సర్వసన్నద్ధంగా ఉండి విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోరారు.


