డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

సత్యసాయి జిల్లా కొత్తచెరువు,నవంబర్,04:

కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా కొత్తచెరువు మండల పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.కొత్తచెరువు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ పంపిణీ కేంద్రాన్ని (డిస్ట్రిబ్యూషన్ సెంటర్) మరియు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని (కౌంటింగ్ హాల్) ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ప్రత్యేకాధికారులు పూర్తి నిఘా ఉంచాలని, సీసీటీవీ కెమెరాల నిరంతర పర్యవేక్షణతో పాటు తగిన పోలీస్ బందోబస్తు ఉంచాలని ఆదేశించారు.
పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా వేగంగా, పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు మరియు అధికారులకు కావలసిన తాగునీరు, విద్యుత్ సరఫరా, షామియానాలు, టాయిలెట్లు, సకాలంలో వైద్య సదుపాయం (ఫస్ట్ ఎయిడ్) అందుబాటులో ఉంచాలన్నారు. కౌంటింగ్ హాల్ వద్ద అగ్నిమాపక యంత్రాలు, అదనపు విద్యుత్ కోసం జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News