శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి
బట్రేపల్లి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ, కదిరి రేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026’ కార్యక్రమంలో భాగంగా బ్లూమూన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. బట్రేపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది సమక్షంలో విద్యార్థులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత ఎం. శివశంకర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భావితరాలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. చెట్ల పెంపకంతో వర్షపాతం పెరగడానికి కూడా దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో బ్లూమూన్ విద్యార్థులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు బ్లూమూన్ పాఠశాల ఉపాధ్యాయులు సురేంద్ర రెడ్డి, మాధవ రెడ్డి, జి. రామాంజుల రెడ్డి, డానియల్ తదితరులు పాల్గొన్నారు.



