అనంతపురం జిల్లా, కనేకల్లు
కనేకల్లు :మండలంలోని హనకనహాల్, బెనికల్, 43 ఉడేగోళం గ్రామాలలో జడ్పీటీసీ టీడీపీ కూటమి అభ్యర్థి బాయినేని ఆదినారాయణ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. నాయకులు కలేకుర్తి సుదర్శన్, బసవరాజు, బాయినేని నవీన్, ఎస్కే మల్లికార్జున, నాగార్జున, ఎర్రిస్వామి, రమేష్, మారుతి, అరుణ రెడ్డి, తదితరులు గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి నాయకులు ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చొరవతో మండలంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ కూటమి అభ్యర్థులకు భారీ మద్దతును కోరారు. గ్రామస్థులు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



