39వ వార్డు అభివృద్ధికి సీపీఎం అభ్యర్థి ముస్తాక్ అలీ ఖాన్‌ను గెలిపించాలి

కదిరి:

39వ వార్డులో సీపీఎం ఇంటింటి ప్రచారం

కదిరి: 39వ వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థి కే. ముస్తాక్ అలీ ఖాన్‌కు మద్దతుగా గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధించడం, అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందేలా కృషి చేయడం, రోడ్లు లేని వీధుల్లో రహదారులు నిర్మించడం తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. మున్సిపల్ పాలకవర్గంలో ప్రజల సమస్యలను బలంగా వినిపించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు జి.ఎల్. నరసింహులు, అభ్యర్థి కే. ముస్తాక్ అలీ ఖాన్, పట్టణ కార్యదర్శి జగన్, నాయకులు సాంబ, బాబ్జాన్, రామ్‌మోహన్, శాంతిభాయి, రమణమ్మ, పైపల్లి గంగాధర్, శివన్న, శ్రీరాములు, కృష్ణ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News