శ్రీ సత్యసాయి జిల్లా , అమడుగూరు మండలం
అనాథాశ్రమ వృద్ధులకు స్వెటర్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ.

అమడుగూరు : మానవత్వంతో చేసే సేవలే సమాజానికి స్ఫూర్తినిస్తాయని చాటుతూ, మహమ్మదాబాద్ గ్రామంలోని సూర్య చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో స్వెటర్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.డాక్టర్ యోగేష్ సి (స్నేహిన్ రెడ్డి) ఆదేశాల మేరకు, వాల్మీకి సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు తలారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధులకు అవసరమైన వస్తువులను అందించడంతో పాటు వారితో ఆప్యాయంగా గడిపి, ప్రేమాభిమానాలను పంచుకున్నారు.
సేవే ధర్మం.. మానవత్వమే మన బలం!
మన దగ్గర ఉన్నది కొంతైనా, మనస్ఫూర్తిగా ఇతరులతో పంచుకోవడమే గొప్ప దానమని ఈ సేవా కార్యక్రమం చాటిచెప్పారు. వృద్ధులకు అండగా నిలుస్తూ, వారిలో ఆత్మీయతను నింపే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అమడగూరు మండల అధ్యక్షుడు వనం శ్రీనివాసులు, పుట్టపర్తి నియోజకవర్గ సలహాదారుడు తలారి పెద్ద కొండప్ప, తలారి శ్రీనివాసులు, హరికృష్ణ, పోతుల శివకృష్ణ, మాంశి మురళీమోహన్, తలారి అమరేష్, తలారి సుధాకర్, తలారి నారాయణస్వామి, తలారి మనోజ్ కుమార్, తలారి విజయ్ కుమార్, పుట్టగొడుగుల రామయ్య తదితరులు పాల్గొన్నారు.


