శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి
ఏపీ అక్షర విజయం న్యూస్, పుట్టపర్తి:-స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పుట్టపర్తిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి కోడ్ తొలగిన తర్వాత కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.అలాగే, మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసే వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పీజిఆర్ఎస్ అర్జీలు సమర్పించేందుకు ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


